కొత్త‌ యాంటీ వైర‌ల్ పూత‌తో.. వారాల‌పాటు దుస్తుల‌కు ర‌క్ష‌ణ‌

న్యూఢిల్లీ: త‌మ సంస్థ త‌యారు చేసిన‌ కొత్త యాంటీ వైర‌ల్ పూతతో క‌రోనా వంటి వైర‌స్ నుంచి దుస్తుల‌కు వారాల‌పాటు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని లోక్ కవాచ్ హెల్త్‌కేర్ సంస్థ తెలిపింది. త‌మ‌ యాంటీ-వైరల్ కోటింగ్ (ఏవీసీ) సాంకేతికత కరోనా వైరస్‌తోపాటు అన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. ఈ ఉత్పత్తిని యూరోపియన్, భారతీయ ప్రయోగశాలలలో అనేక ర‌కాలుగా పరీక్షించిన‌ట్లు తెలిపింది. ఇది బహుముఖ యాంటీ మైక్రోబయల్ పరిష్కార‌మ‌ని, అన్ని ఉపరితలాలు, దుస్తుల‌కు దీనిని వినియోగించ‌వ‌చ్చ‌ని వివ‌రిచింది. ఢిల్లీకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెన్సీ తురియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఉత్పత్తిని త్వ‌ర‌లో ప్రారంభించనున్న‌ద‌ని లోక్ కవాచ్ హెల్త్‌కేర్ సంస్థ వెల్ల‌డించింది.

కాగా, ఈ యాంటీ-వైరల్ కోటింగ్ టెక్నాలజీని రూపొందించడానికి చాలా ప‌రిశోధ‌న చేసిన‌ట్లు తురియా ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో ల్యూక్ తల్వార్ తెలిపారు. ఈ ఉత్పత్తి సెకన్లలోనే 99.995 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. వారాల పాటు సూక్ష్మజీవుల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉపరితలాన్ని, దుస్తుల‌ను శుభ్రపరుస్తుంద‌ని చెప్పారు, ఈ లిక్విడ్ వ‌ల్ల మ‌నుషుల‌కు ఎలాంటి హానీ ఉండ‌ద‌ని వివ‌రించారు.

కొత్త‌ యాంటీ వైర‌ల్ పూత‌తో.. వారాల‌పాటు దుస్తుల‌కు ర‌క్ష‌ణ‌

Leave A Reply